* 3,048 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం పచ్చ జెండా
* మున్సిపాల్టీల్లో ఉపాధ్యాయ ఖాళీలు 1276
* రవాణా శాఖలో అదనంగా 392
* విశ్వవిద్యాలయాల్లో 821
* ఆర్థిక శాఖ అనుమతి
* మున్సిపాల్టీల్లో ఉపాధ్యాయ ఖాళీలు 1276
* రవాణా శాఖలో అదనంగా 392
* విశ్వవిద్యాలయాల్లో 821
* ఆర్థిక శాఖ అనుమతి
రాష్ట్ర ప్రభుత్వం వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. 3,048 ఉద్యోగాల నియామకానికి ఆర్థిక శాఖ పచ్చ జెండా వూపింది. మున్సిపాల్టీల్లోని ఉపాధ్యాయ ఉద్యోగాల ఖాళీలు 1276 ఉన్నట్లు గుర్తించారు. వాటిని డీఎస్సీల ద్వారా భర్తీ చేస్తారు. పలు విశ్వవిద్యాలయాల్లో 821 ఖాళీలను భర్తీ చేయబోతున్నారు. రవాణాశాఖకు అదనంగా 392 ఉద్యోగాలను మంజూరు చేశారు. వీటితోపాటు వివిధ విభాగాల్లోని 287 ఉద్యోగాల నియామకాన్ని ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్‌కి అప్పగించారు. ఆర్టీసీలో 604 పోస్టులు భర్తీ చేసుకొనేందుకు అనుమతించారు. జూన్ నెలలో ఆర్థిక శాఖ 57,304 ఖాళీల భర్తీకి అనుమతిని ఇచ్చింది. వివిధ శాఖల నుంచి మరిన్ని ప్రతిపాదనలు రావడంతో తాజాగా మరిన్ని ఉద్యోగాల భర్తీకి అనుమతిని మంజూరు చేసింది.
జిల్లా, జోన్లవారీగా ఖాళీల వివరాలు, రోస్టర్ పాయింట్లు, అర్హతల వివరాలన్నింటినీ రప్పించుకొని నియామక ప్రక్రియను చేపడతారు. గ్రంథాలయాలు, గిరిజన సంక్షేమ శాఖ సంచాలకుల కార్యాలయాల్లోని జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం పేరుని జూనియర్ అసిస్టెంట్ కమ్ డాటా ప్రాసెసింగ్ అసిస్టెంట్‌గా మార్చారు
No comments:
Post a Comment